దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనాల్ మెస్సీ.. బార్సిలోనా ఫ్రాంచైజీతో చేసుకున్న ఒప్పందం విలువ ఎంతో తెలుసా? నాలుగు సీజన్లకు కలిపి రూ.4900 కోట్లు. ఓ క్రీడాకారుడు పొందిన అతిపెద్ద మొత్తం ఇదే. ఇందుకు సంబంధించిన విషయాలను తాజాగా స్పెయిన్‌కు చెందని ఎల్ ముండో అనే వార్త సంస్థ బయటపెట్టింది.
2017లో ప్రతి సీజన్‌కు రూ.12.21వందల కోట్లు చెల్లించడానికి బార్సిలోనాకు చెందిన కాటలన్ క్లబ్ అంగీకరించింది. ఈ కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది. తాజాగా మళ్లీ ఒప్పందం కుదుర్చుకోలేదు. సదరు మొత్తం నుంచి సగం డబ్బులు.. పన్నుల రూపంలో స్పెయిన్ ప్రభుత్వానికి.. మెస్సీ చెల్లించాడు.