తెలంగాణ

telangana

ETV Bharat / sports

రొనాల్డోతో డిన్నర్​కు మెస్సీ అంగీకారం..! - క్రిస్టియాన్​ రొనాల్డో

ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సీతో డిన్నర్​ చేయాలని ఉందని చెప్పాడు మరో స్టార్​ ప్లేయర్​ క్రిస్టియాన్​ రొనాల్డో. ఇటీవల యూఈఎఫ్ఎ (యూనియన్  ఆఫ్ యురోపియన్ ఫుట్​బాల్ ఫర్  అసోసియేషన్) నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు మెస్సీ.

రొనాల్డోతో డిన్నర్​కు మెస్సీ అంగీకారం..!

By

Published : Sep 14, 2019, 12:36 PM IST

Updated : Sep 30, 2019, 1:49 PM IST

మెస్సీ, రొనాల్డో ఫుట్​బాల్​ ఆటలో పేరుగాంచిన ఆటగాళ్లు. మైదానంలో ప్రత్యర్థులుగా ఎదురుపడితే అభిమానులకు దానికి మించిన కిక్​ ఉండదు. ఈ ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఇద్దరినీ ఒకే వేదికపై నిలబెట్టింది యూఈఎఫ్ఎ (యూనియన్ ఆఫ్ యురోపియన్ ఫుట్​బాల్ ఫర్ అసోసియేషన్) అవార్డుల ప్రదానోత్సవ వేడుక.

ఈ కార్యక్రమంలో మెస్సీతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు రొనాల్డో. తనతో కలిసి డిన్నర్​ చేయాలనుందని వెల్లడించాడు. అయితే ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు మెస్సీ.

రొనాల్డో, మెస్సీ

" అతడితో కలిసి డిన్నర్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. రొనాల్డోతో నాకెలాంటి గొడవలు లేవు. ఇప్పటివరకూ మేమిద్దరం కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కుదరలేదు కాబట్టి స్నేహితులు కాలేకపోయాం. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాల్లో తనని ఎప్పుడు చూసినా నాకెలాంటి శత్రుత్వం కనపడదు".
-- మెస్సీ, ఫుట్​బాల్​ ఆటగాడు

రొనాల్డో డిన్నర్​ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పాడు లియోనల్​ మెస్సీ.

" ఇటీవల జరిగిన కార్యక్రమంలో మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తామో లేదో తెలియదు. ఎందుకంటే అతడికీ.. నాకూ అనేక కారణాలు ఉండొచ్చు. ఇద్దరికీ వ్యక్తిగత జీవితంతో పాటు కమిట్​మెంట్లూ ఉంటాయి. అయితే అతడి కోరికని మాత్రం అంగీకరిస్తాను" అని మెస్సీ చెప్పుకొచ్చాడు.

డిన్నర్​ చేస్తావా మిత్రమా...!

ఈ ఏడాది ఆగస్టులో యూఈఎఫ్ఎ (యూనియన్ ఆఫ్ యురోపియన్ ఫుట్​బాల్ ఫర్ అసోసియేషన్) అవార్డుల ప్రదానోత్సవంలో మెస్సీ గురించి రొనాల్డో మాట్లాడాడు. 15 ఏళ్లుగా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నా... ఇప్పటివరకు కలిసి డిన్నర్​ చేయలేదని చెప్పాడు. భవిష్యత్తులో కచ్చితంగా ఆ అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మెస్సీతో పోటీపడి ఆడటం వల్లే తాను అత్యుత్తమ ఆటగాడిగా తయారయ్యానని చెప్పాడు రొనాల్డో.

యుఈఎఫ్​ఏ ఛాంపియన్స్​ లీగ్​లో అత్యధిక గోల్స్​ చేసిన ఆటగాడిగా 2012 నుంచి రొనాల్డో అవార్డు తీసుకుంటున్నాడు. గతేడాది జరిగిన టోర్నీలో 12 గోల్స్​ చేసిన మెస్సీ... టాప్​ స్కోరర్​గా నిలిచి​ ఆ ట్రెండ్​ బ్రేక్​ చేశాడు.

ఇదీ చూడండి...

Last Updated : Sep 30, 2019, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details