ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్... సాధారణ కార్మికులు, సిబ్బందికి యధావిధిగా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫుట్బాల్ టోర్నీలు రద్దవగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా ఫ్రాంచైజీలు, క్లబ్ యజమాన్యాలు భారీ నష్టాలు ఎదుర్కొనున్నాయి. అయితే గత మూడు నెలలుగా సేవలందిస్తున్న చిన్నస్థాయి వర్కర్లకు జీతాలు ఇస్తామని తాజాగా ప్రకటించింది మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్.
" మాంచెస్టర్ యునైటెడ్ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అన్ని మ్యాచ్లు జరగకపోయినా సాధారణ కార్మికులు, సిబ్బందికి కచ్చితంగా జీతాలు అందిస్తాం. ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు పూర్తిగా రద్దయినా ,ప్రేక్షకులు లేకుండా నిర్వహించినా మా నిర్ణయంలో మార్పు ఉండదు"