30 ఏళ్ల తర్వాత విజేతగా నిలిచిన లివర్‌పూల్ - 30 ఏళ్ల తర్వాత విజేతగా నిలిచిన లివర్‌పూల్
ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌లో లివర్‌పూల్ జట్టు విజేతగా నిలిచింది. ఇంకా 7 మ్యాచ్‌లు ఉండగానే టైటిల్‌ను సొంతం చేసుకుంది. అనంతరం కరోనా ప్రభావంతో స్టేడియం బయట చాలామంది తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.
![30 ఏళ్ల తర్వాత విజేతగా నిలిచిన లివర్‌పూల్ 30 ఏళ్ల తర్వాత విజేతగా నిలిచిన లివర్‌పూల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7774748-153-7774748-1593143250312.jpg)
లివర్‌పూల్ ఫుట్‌బాల్ జట్టు
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రీమియర్ లీగ్‌లో ప్రముఖ ఫుట్‌బాల్ జట్టు లివర్‌పూల్ విజేతగా నిలిచింది. 7 మ్యాచ్‌లు మిగిలుండగానే కప్పు సాధించింది. 30 ఏళ్లలో సొంతగడ్డపై లీగ్‌లో దక్కించుకోని టైటిల్‌ను, ఈసారి చేజిక్కుంచుకుంది. ఈ క్రమంలో పలు రికార్డులకు సృష్టించింది.
- ప్రీమియర్ లీగ్‌లోని ఓ సీజన్లో మాంచెస్టర్ యునైటెడ్(2000-01), మాంచెస్టర్ సిటీ(2017-18) ఐదు మ్యాచ్‌లు మిగిలుండగా కప్పు కొట్టాయి. లివర్‌పూల్ మాత్రం ఏడు మ్యాచ్‌లుండగానే విజేతగా నిలిచింది. ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ విజేతగా లివర్‌పూల్ జట్టు
- ఈ మ్యాచ్‌లో క్రిస్టల్ ప్యాలెస్‌పై 4-0 తేడాతో గెలిచిన లివర్‌పూల్.. సొంతగడ్డపై వరుసగా 23 మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ ఘనత మాంచెస్టర్ సిటీ(20) పేరిట ఉంది.
- లీగ్‌లో టోటెన్హమ్ జట్టుపై గెలిచిన లివర్‌పూల్.. ప్రీమియర్ లీగ్‌లోని ఓ సీజన్లో అత్యధిక పాయింట్లు(104) సాధించింది. ఇంతకుముందు 102 పాయింట్లతో స్ట్రెచస్ సిటీ, చెల్సా పేరిట ఈ రికార్డు ఉంది. లివర్‌పూల్ ఫుట్‌బాల్ జట్టు
- ఓ ప్రీమియర్ లీగ్ సీజన్లో సొంతగడ్డపై జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన తొలి జట్టుగా లివర్‌పూల్ అవతరించింది.
- మూడు వరుస సీజన్లలో అన్ని పోటీల్లో పాల్గొని ఎక్కువ గోల్స్ కొట్టిన ప్లేయర్‌గా మహ్మద్ సాలా(20) ఘనత సాధించాడు. లివర్‌పూల్ ప్లేయర్ మహ్మద్ సాలా