తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛాంపియన్స్ లీగ్ విజేతగా ఆరోసారి లివర్​పూల్​ - liver pool player sala

యూరోపియన్​ యూనియన్ ఫుట్​బాల్ అసోసియేషన్ ఛాంపియన్స్​ లీగ్​ ఫైనల్​లో లివర్​పూల్​ జట్టు విజేతగా నిలిచింది. టొటెన్​హామ్​ జట్టుపై 2-0తో విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. ఫలితంగా 2005 తర్వాత మళ్లీ ఛాంపియన్​గా అవతరించింది.

ఆరోసారి యూరోపియన్​ ఫుట్​బాల్​ విజేతగా లివర్​పూల్​

By

Published : Jun 2, 2019, 11:11 AM IST

యూరోపియన్​ యూనియన్ ఫుట్​బాల్ అసోసియేషన్ ​ఛాంపియన్స్​ లీగ్​ విజేతగాలివర్​పూల్ ఎఫ్​సీ జట్టు నిలిచింది. శనివారం మాడ్రిడ్​ వేదికగా టొటెన్​హామ్​ హాట్​స్పర్స్​తో జరిగిన ఫైనల్​ పోరులో 2-0తో విజయం సాధించింది లివర్​పూల్​. గతంలోనూ ఐదుసార్లు( 1977, 1978, 1981, 1984, 2005) ఛాంపియన్​గా నిలిచింది లివర్​పూల్ జట్టు. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ కప్పు సొంతం చేసుకుంది​.

మ్యాచ్​ ఆరంభానికి ముందే టొటెన్​హామ్​కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్​ ప్లేయర్​ హర్రీ కేన్​ తప్పుకోవలసి వచ్చింది.

సలా రికార్డు...

లివర్​పూల్​ స్టార్ ఆటగాడు​ సలా, మరో క్రీడాకారుడు ఒరిజి డ్రైవ్​ చెరో గోల్​ చేసి జట్టుకు విజయాన్నందించారు. యూరోపియన్​ కప్​ ఫైనల్​లో గోల్​ చేసిన మొదటి ఈజిప్షియన్​గా ఘనత సాధించాడు సలా.

తొలి అర్ధ భాగంలో 1-0తో కొనసాగింది లివర్​ పూల్. రెండో అర్ధభాగం 74వ నిముషంలో ఎరిక్​ బదులుగా వచ్చిన సబ్సిట్యూట్​ మౌసా రెండో గోల్​ చేశాడు. ఫలితంగా చివరికి 2-0తో విజయం సాధించి విజేతగా నిలిచింది.

గతేడాది జరిగిన ఇదే టోర్నీలో ఒక్క పాయింట్​ తేడాతో లివర్​పూల్​ రెండో స్థానంతో సరిపెట్టుకోగా... మాంచెస్టర్​ సిటీ కప్పు గెలుచుకుంది.

ABOUT THE AUTHOR

...view details