స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. స్పానిష్ సూపర్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు ఆటగాడిని చేతితో తీవ్రంగా గాయపరిచినందుకుగాను స్పానిష్ సాకర్ సమాఖ్య మంగళవారం, ఈ నిర్ణయం తీసుకుంది.
స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీపై రెండు మ్యాచ్‌ల నిషేధం
బార్సిలోనా ఫుట్‌బాలర్ మెస్సీపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. ఆ జట్టు తరఫున మెస్సీ 753 మ్యాచులు ఆడగా.. రెడ్‌కార్డు తీసుకోవడం మాత్రం ఇదే ప్రథమం.
మెస్సీపై నిషేధం.. ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరిచినందుకే
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో గోల్ పోస్ట్ వైపు వెళ్తున్న క్రమంలో అథ్లెటిక్ బిల్బావో ఫుట్‌బాలర్ ఏసియర్ను చేతితో గట్టిగా కొట్టాడు మెస్సీ. దీంతో అతడు అక్కడికక్కడే కిందపడిపోయాడు. ఇలాంటి తప్పిదాలకు 12 మ్యాచుల వరకు నిషేధం విధించే అవకాశముంది. అయితే దానిని అంత తీవ్రంగా పరిగణించని సమాఖ్య.. మెస్సీపై తక్కువ పెనాల్టీ విధించింది.
ఇదీ చూడండి:పీలే రికార్డు తిరగరాసిన మెస్సీ.. ఏమన్నాడంటే?