ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో అనుబంధానికి తెరపడిన అనంతరం అతడు ఏ క్లబ్‌లో చేరబోతున్నాడనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అయితే ఇప్పుడా సందిగ్ధతకు తెరపడింది. మెస్సీ.. ప్యారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్‌జీ) క్లబ్‌లో చేరాడు. ఈ విషయాన్ని మెస్సీ తండ్రి, అతడికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న జార్జ్ మెస్సీతో పాటు ఆ క్లబ్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. ఈ క్లబ్‌లో అతడు రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు. దీంతో అతడి అభిమానులతో పాటు పీఎస్‌జీ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
ప్యారిస్ క్లబ్‌తో మెస్సీ కాంట్రాక్ట్.. ఫ్యాన్స్ హంగామా - ఫుట్‌బాల్ వార్తలు
అర్జెంటినా ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ.. ప్యారిస్ సెయింట్ జర్మన్(పీఎస్‌జీ) క్లబ్‌లో చేరాడు. బార్సిలోనాతో ఒప్పందం ముగిసిన అనంతరం పీఎస్జీలో చేరేందుకు మెస్సీ అంగీకరించాడు. ఇదే విషయాన్ని ప్యారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ ట్విట్టర్లో ప్రకటించింది.
ప్యారిస్ సెయిట్ జర్మన్ క్లబ్‌లో చేరిన మెస్సీ
అర్జెంటినాకు చెందిన మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. తన 17 ఏట 2004 క్లబ్‌లోకి వచ్చిన అతడు మొత్తం 17 సీజన్లు ఆడాడు. వివిధ లీగుల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్లబ్ తరఫున 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్ సాధించాడు. మెస్సీతో తమ కాంట్రాక్టును పునరుద్ధరించలేమని బార్సిలోనా గత గురువారం ప్రకటించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి..ఆ క్లబ్‌తో కొత్త ఒప్పందానికి మెస్సీ గ్రీన్ సిగ్నల్!