తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫిఫా అవార్డులు: మేటి ఆటగాళ్లుగా మెస్సీ, మేగాన్​

ఫిఫా వార్షిక పురస్కారాలను ప్రకటించింది. పురుషుల విభాగంలో ​లియోనల్​ మెస్సీ(అర్జెంటీనా) ప్లేయర్​ ఆఫ్​ ద ఇయర్​గా ఎంపికయ్యాడు.  మహిళల్లో 'ప్లేయర్​ ఆఫ్​ ద ఇయర్​ అవార్డును మేగాన్​ రాపివోయ్(అమెరికా) గెలుచుకుంది. బ్రెజిల్​కు చెందిన ఫుట్​బాల్​ ప్లేయర్​ సిల్వియా గ్రెకో ఫిఫా ఉత్తమ అభిమాని అవార్డు అందుకుంది.

ఫిఫా అవార్డులు: మేటి ఆటగాళ్లుగా మెస్సీ, మేగాన్​

By

Published : Sep 24, 2019, 4:15 PM IST

Updated : Oct 1, 2019, 8:15 PM IST

ఫిఫా అవార్డులు: మేటి ఆటగాళ్లుగా మెస్సీ, మేగాన్​

అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్​బాల్​ క్రీడాకారుడు లియోనల్ మెస్సీని... ఆరోసారి ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. మిలాన్‌లోని ఓపెరా హౌస్‌లో సోమవారం ఈ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. మహిళల విభాగంలో ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మేగాన్ రాపినోయ్(అమెరికా) గెలుచుకుంది.

మెస్సీ ఆరోసారి...

పురుషుల్లో మెస్సీతో పాటు ఈ అవార్డు కోసం క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగల్​), లివర్ పూల్ డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్‌లు పోటీపడ్డారు.
గత సీజన్‌లో బార్సిలోనా జట్టుతో కలిసిన స్పానిష్ లాలిగా టైటిల్​ను నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు మెస్సీ. ఈ టోర్నీలో మొత్తం 58 మ్యాచ్​ల్లో... 54 గోల్స్ సాధించాడు. ఫలితంగా యురోపియన్ లీగ్ గోల్డెన్ బూట్‌నూ సొంతం చేసుకున్నాడు. రొనాల్డో 55 గేముల్లో 54 గోల్స్ చేశాడు.

ఈ ఏడాది లివర్‌పూల్ జట్టుని ఛాంపియన్ లీగ్ టైటిల్ విజేతగా నిలబెట్టాడు డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్. ఈ సీజన్‌లో యురోపియన్ ఉత్తమ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇతడు రేసులో నిలిచినా... అభిమానులు మాత్రం ఈ అవార్డుని మెస్సీకే కట్టబెట్టారు.

మహిళల్లో మేగాన్​...

ఈ ఏడాది జులైలో జరిగిన మహిళల ప్రపంచకప్​లో మేగాన్ రాపినోయ్ సారథ్యంలోని అమెరికా జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ఈ మెగా టోర్నీలో మేగాన్ ఆరు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారిణిగానూ నిలిచింది. ఫలితంగా గోల్డెన్ బూట్‌తో పాటు గోల్డెన్ బంతినీ దక్కించుకుంది. మహిళల కోచ్ అవార్డును జిల్ ఇల్లీస్ సొంతం చేసుకుంది.

పురుషులు: ఫిఫా ఉత్తమ ప్లేయర్

లియోనల్ మెస్సీ

మహిళలు: ఫిఫా ఉత్తమ ప్లేయర్

మేగాన్ రాపినోయ్ - విజేత

ఉత్తమ ఫిఫా పురుషుల కోచ్

జుర్గెన్ క్లోప్ - విజేత

ఉత్తమ ఫిఫా ఉమెన్స్ కోచ్

జిల్ ఎల్లిస్ - విజేత

ఫిఫా పుస్కాస్ అవార్డు

డేనియల్ జొసోరి - విజేత

ఉత్తమ ఫిఫా పురుషుల గోల్ కీపర్

అలిసన్ బెకర్

ఉత్తమ ఫిఫా మహిళల గోల్ కీపర్

చీర వాన్ వీనెండల్

ఫిఫా ఫ్యాన్ అవార్డు

సిల్వియా గ్రెకో

ఇదీ చదవండి: దిగ్గజ క్రికెటర్​ షేన్​వార్న్​పై ఏడాది నిషేధం

Last Updated : Oct 1, 2019, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details