తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ సీజన్‌కు మెస్సీ బార్సిలోనాతోనే - foot ball player messy

బార్సిలోనా ఎఫ్​సీకి దూరం కావాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాడు స్టార్ ఫుట్​బాలర్ లియోనల్​ మెస్సీ. ఈ సీజన్​కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు.

Messi
మెస్సి

By

Published : Sep 5, 2020, 7:19 AM IST

ప్రముఖ ఫుట్​బాలర్ లియోనల్‌ మెస్సీ బార్సిలోనా ఎఫ్‌సీని వీడాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకున్నాడు. ఈ సీజన్‌కు తాను ఈ జట్టులోనే ఉంటానని శుక్రవారం ప్రకటించాడు. క్లబ్‌తో తాను న్యాయ వివాదంలోకి వెళ్లాలనుకోవట్లేదని అన్నాడు.

విభేదాల కారణంగా మెస్సీ ఈ సీజన్‌ నుంచే బార్సిలోనాకు దూరం కావాలనుకున్నాడు. కానీ కాంట్రాక్టు ప్రకారం అతడు 2021 చివరి వరకు తమతో ఉండాల్సిందేనని, లేదంటే 837 మిలియన్‌ డాలర్లు చెల్సించాల్సివుంటుందని సదరు క్లబ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మెస్సీ ఈ ఏడాదికి కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. మెస్సీ తండ్రి జార్జ్‌ బార్సిలోనా అధ్యక్షుడు జోసెఫ్‌ బార్టోమితో మెస్సీ భవితవ్యంపై చర్చించాడు. అతడు బార్సిలోనాను వీడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే మెస్సీని వదులుకునేందుకు సిద్ధంగా లేమని జోసెఫ్‌ స్పష్టం చేయడం వల్ల.. సీజన్‌ ముగిసే వరకు ఆ జట్టుతోనే ఉండాలని మెస్సీ నిర్ణయించుకున్నాడు.

మెస్సి

ఇదీ చూడండి సీపీఎల్: ఇదేమి సెలబ్రేషన్​రా నాయనా..​!

ABOUT THE AUTHOR

...view details