తెలంగాణ

telangana

ETV Bharat / sports

మారడోనాకు మెస్సీ నివాళి.. రూ.54 వేల జరిమానా - మారడోనాకు నివాళి

దిగ్గజ ఫుట్​బాల్ ఆటగాడు​ మారడోనాకు మ్యాచ్​ మధ్యలో నివాళి అర్పించినందుకు ప్రముఖ ఆటగాడు మెస్సీకి జరిమానా విధించారు. ఈ మ్యాచ్​లో బార్సిలోనా విజయం సాధించింది.

Lionel Messi fined 600 euros for tribute to Maradona
మెస్సీ మారడోనా

By

Published : Dec 3, 2020, 3:46 PM IST

స్టార్ ఫుట్​బాల్ ఆటగాడు​ లియోనాల్​ మెస్సీకి స్పానిష్ సాకర్ ఫెడరేషన్​ జరిమానా విధించింది. ఇటీవల మృతి చెందిన దిగ్గజ ఫుట్​బాలర్ మారడోనాకు మైదానంలో నివాళి అర్పిస్తూ జెర్సీ తీసినందుకు 600 యూరో(రూ.54 వేలు)లు ఫైన్ వేసింది. ఈ విషయాన్ని బుధవారం వెల్లడించింది. ఆదివారం, ఒషాసునా- బార్సిలోనా మ్యాచ్​లో ఈ సంఘటన జరిగింది. ఇందులో 4-0 తేడాతో బార్సిలోనా గెలిచింది.

మ్యాచ్​లో గోల్​ కొట్టిన మెస్సీ.. బార్సిలోనా జెర్సీని తీసి.. లోపల వేసుకున్న ఎరుపు, నలుపు రంగులు కలిసున్న మరో జెర్సీతో మారడోనాకు నివాళి అర్పించాడు. ఈ సందర్భంగా రెండు చేతులతో ముద్దు పెడుతూ, ఆకాశం వైపు చూశాడు. మ్యాచ్​ ముగిసిన తర్వాత తన ఫొటో, మారడోనా ఫొటోను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశాడు.

ఫుట్​బాల్ దిగ్గజం డిగో మారడోనా(60).. గత బుధవారం గుండెపోటుతో మరణించాడు. అయితో చికిత్స అందించిన వైద్యుడి వల్లే డిగో మరణించాడని సందేహాలు వస్తున్న నేపథ్యంలో అర్జెంటీనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మెస్సీ ఇన్​స్టాలో పోస్ట్ చేసిన ఫొటో

ABOUT THE AUTHOR

...view details