స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో.. తన ఆటతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అతడిపై ఉన్న ఇష్టానికి గుర్తుగా, రొనాల్డో లైఫ్ సైజ్ చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేశాడు జార్జ్ కర్డాసో అనే ఓ శిల్పి. ఈ మంగళవారమే ఆవిష్కరించారు. రొనాల్డో స్వస్థలం పోర్చుగల్‌లోని ఓవర్లో జరుగుతున్న కార్నివాల్లో ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచారు.
జార్జ్.. చాక్లెట్‌తో విగ్రహాలు చేయడంలో సిద్ధహస్తుడు. ఇంతకు ముందు 2018లో కళాత్మక చాక్లెట్ శిల్పాల తయారీ పోటీలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఓవర్లో పుట్టిన ఇతడు ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివాసముంటున్నాడు.
200 గంటలు.. 17 గంటల ప్రయాణం