బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేకు(Pele Footballer) వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పెద్దప్రేగులోని కణితిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించిన అనంతరం వైద్యులు ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు. 'ప్రస్తుతం పీలే ఆరోగ్యం నిలకడగా ఉంది. కీలక అవయవాలన్నీ బాగానే పని చేస్తున్నాయి. ఆయన ఉత్సాహంగా మాట్లాడగలుతున్నారు' అని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 'రోజురోజుకి నా ఆరోగ్యం మెరుగుపడుతోంది' అని పీలే(Pele News) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేయారు.
ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం పీలే!
ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(footballer pele in hospital).. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పెద్దపేగులోని కణతిని తొలగించిన అనంతరం ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు వైద్యులు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన అభిమానులకు తన ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు పీలే.
పీలే
మూడు ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా పీలే(Pele Football goals) రికార్డు సృష్టించారు. 1958, 1962, 1970ల్లో మూడు సార్లు పీలే బ్రెజిల్‌ను 'ఫుట్‌బాల్ ఛాంపియన్'గా నిలిపారు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి:Ind vs Eng: 'భారత్ చివరి టెస్టు ఆడకపోవడానికి కారణమదే'
Last Updated : Sep 12, 2021, 9:29 AM IST