తెలంగాణ

telangana

ETV Bharat / sports

రియల్ మాడ్రిడ్ ప్లేయర్​కు కరోనా.. ఫైనల్​కు దూరం - రియల్ మాడ్రిక్ ఫైనల్ గేమ్

కీలకపోరుకు ముందు రియల్ మాడ్రిడ్​ మిడ్​ఫీల్డర్ టోనీ క్రూస్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో ఈ జట్టు ఆఖరి మ్యాచ్​లో అతడు ఆడటం లేదని వెల్లడించింది క్లబ్.

Toni Kroos
క్రూస్

By

Published : May 18, 2021, 9:36 AM IST

కీలక పోరుకు ముందు రియల్ మాడ్రిక్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ జట్టు మిడ్​ఫీల్డర్​ టోనీ క్రూస్ కరోనా బారిన పడటం వల్ల ఇతడు ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపింది క్లబ్. ఫైనల్ పోరులో అతడు ఆడట్లేదని వెల్లడించింది.

"మా జట్టు ప్లేయర్ టోనీ క్రూస్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. శుక్రవారం నుంచి అతడు ఐసోలేషన్​లో ఉంటున్నాడు. అతడు ఫైనల్ పోరులో ఆడట్లేదు" అని ప్రకటన జారీ చేసింది రియల్ మాడ్రిడ్ క్లబ్.

ఆదివారం అట్లెటికో బిల్బావోతో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది రియల్ మాడ్రిడ్. అయినా కూడా లా లిగా టైటిల్ కోసం కాస్త వెనకబడి ఉంది. ప్రస్తుతం అట్లెటిటో మాడ్రిడ్​ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా రియల్ మాడ్రిడ్ రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య రెండు పాయింట్ల వ్యత్యాసం ఉంది.

రియల్ మాడ్రిడ్ టైటిల్ గెలవాలంటే తన ఆఖరి మ్యాచ్​లో విల్లేరియల్​పై కచ్చితంగా గెలిచి తీరాలి. అలాగే అట్లెటికో.. వల్లాడోలిడ్​ చేతిలో ఓటమి చెందాలి. అలా అయితేనే జిందానే జట్టు టైటిల్ కైవసం చేసుకుంటుంది.

ABOUT THE AUTHOR

...view details