తెలంగాణ

telangana

ETV Bharat / sports

మారడోనా గుర్తుగా ప్రపంచస్థాయి మ్యూజియం - foot baller diego maradona

దిగ్గజ ఫుట్​బాలర్​ డీగో మారడోనా జ్ఞాపకార్థంగా ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్త. ఇందులో డీగో బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

maradona
మారడోనా

By

Published : Dec 8, 2020, 7:59 AM IST

ఫుట్​బాల్​ దిగ్గజం డీగో మారడోనా గుర్తుగా ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్​ ప్రకటించారు. అందులో ప్రత్యేక ఆకర్షణగా డీగో బంగారు శిల్పాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మ్యూజియం కోల్​కతా లేదా దక్షిణా భారత్​లో నిర్మించే వీలుంది.

గత నెల 25న గుండెపోటుతో మరణించిన మారడోనాకు బాబీ మంచి స్నేహితుడు. నగల వ్యాపారి అయిన ఆయన ఎనిమిదేళ్ల క్రితం డీగోను కేరళకు తీసుకొచ్చారు.

"2011 నుంచి మారడోనాతో నాకు అనుబంధం ఉంది. తన రూపంతో ఉన్న చిన్న బంగారు విగ్రహాన్ని అతనికి అందించా. అది తీసుకున్న అతను తన ఎత్తుతో ఉన్న బంగారు శిల్పాన్ని చూడాలని ఉందనే కోరికను వ్యక్త పరిచాడు. అది కూడా 'ది హ్యాండ్​ ఆఫ్​ గాడ్​' గోల్​ను గుర్తుకు తెచ్చేలా ఉండాలని ఆశించాడు. అతని కోరికను నిజం చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యూజియం అతనికి అంకితం. అందులో అతని వ్యక్తిగత, ఆటకు సంబంధించిన విశేషాలను పొందుపరుస్తాం" అని బాబీ తెలిపారు. ఈయన​ అంతర్జాతీయ సంస్థకు మారడోనా ప్రచారకర్తగా పనిచేశారు.

ఇదీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details