ఫుట్‌బాల్ లీగ్ ఐఎస్ఎల్లో హైదరాబాద్ జట్టు ఆడనుంది. అక్టోబరు 20న ఆరంభమయ్యే ఈ లీగ్ ఆరో సీజన్లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అరంగేట్రం చేయబోతోంది. కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఎఫ్‌సీ పుణె సిటీ స్థానంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీకి చోటు దక్కింది. అయిదో సీజన్‌కు సంబంధించి ఆటగాళ్లు, సిబ్బందికి పుణె క్లబ్ యాజమాన్యం జీతాలు కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఆ ఫ్రాంఛైజీని రద్దు చేయాలని ఐఎస్‌ఎల్ యాజమాన్యం నిర్ణయించింది.
ఇండియన్ సూపర్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు - etvbharat sports
తెలుగు రాష్ట్రాల ఫుట్‌బాల్ ప్రియులకు శుభవార్త. ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సాకర్ అభిమానుల్ని అలరిస్తోన్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో హైదరాబాద్ అడుగుపెట్టబోతుంది.
ఇండియన్ సూపర్‌లీగ్‌లో హైదరాబాద్ జట్టు
హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ పేరుతో ఏర్పాటైన కొత్త ఫ్రాంఛైజీని... విజయ్ మద్దూరి, వరుణ్ త్రిపురనేని కొనుగోలు చేశారు. గచ్చిబౌలిలోని ఫుట్‌బాల్ స్టేడియం కేంద్రంగా ఈ ఫ్రాంఛైజీ నడుస్తుంది.
ఇదీ చదవండి...దిగ్గజానికి వీడ్కోలు పలికే టైమొచ్చింది...
Last Updated : Sep 28, 2019, 1:37 PM IST