కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో క్రికెట్ సిరీస్‌లు.. యూఏఈలో ఐపీఎల్‌తో పాటు వివిధ దేశాల్లో బయో బబుల్ వాతావరణంలో టోర్నీలు జరిగాయి.. జరుగుతున్నాయి! ఇప్పుడు మన దగ్గర కూడా బుడగలో ఓ పెద్ద టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. నవంబర్ 20(శుక్రవారం) ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 4 నెలల పాటు గోవాలోని మూడు వేదికల్లో జరిగే ఈ టోర్నీలో 115 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 11 జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా నిర్వాహకులు పటిష్టమైన భద్రత, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.
భారత్ ఆతిథ్యంలో.. నేటి నుంచే ఇండియన్ సూపర్‌లీగ్ - ఇండియన్ సూపర్‌లీగ్ వార్తలు
ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) నిర్వహణకు రంగం సిద్ధమైంది. శుక్రవారం(నేటి) నుంచి ప్రారంభంకానున్న ఈ ఫుట్‌బాల్ టోర్నీని గోవా వేదికగా నిర్వహించనున్నారు. దాదాపు నాలుగు నెలల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఐఎస్‌ఎల్
బయో నిబంధనలు:
- కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో ప్రతి జట్టుకు ప్రత్యేకంగా ఒక హోటల్ కేటాయించారు. మూడు మైదానాల్లో పనిచేసే టీవీ ప్రసార సిబ్బందిని విడివిడిగా 3 హోటళ్లలో ఉంచారు.
- బుడగలో ఉన్నవాళ్లకు ప్రతి మూడు రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తారు.
- బుడగ నిబంధనల్ని అతిక్రమించినా.. కొత్తగా ఎవరైనా వచ్చినా ఐసోలేషన్ తప్పనిసరి. నిబంధనల్ని మళ్లీ మొదట్నుంచి అనుసరించాలి. రెండు సార్లు పరీక్షలు చేయించుకోవాలి. నాలుగైదు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. మళ్లీ పరీక్ష చేయించుకోవాలి. మూడు పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే బుడగలోకి అనుమతిస్తారు.
- ఎవరైనా పాజిటివ్‌గా తేలితే వేరే అంతస్తులో 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. రెండు సార్లు నిర్వహించే పరీక్షల్లో నెగటివ్ వస్తేనే మళ్లీ అనుమతిస్తారు. మొదటి పరీక్షలో నెగటివ్ వచ్చిన 48 గంటల్లో రెండో పరీక్ష ఉంటుంది. రెండింట్లో నెగటివ్ వస్తే బుడగలోకి రావొచ్చు.
ఇదీ చూడండి : యువ జోరుకు టీ20 ప్రపంచకప్‌లో చోటు పక్కా!