తమ ఆరాధ్య సెలబ్రిటీలు, ఆటగాళ్లు కనిపిస్తే సెల్ఫీనే, ఆటోగ్రాఫ్ అడుగుతారు. కానీ ఓ అభిమాని మాత్రం భారత ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రిని, నెట్‌ఫ్లిక్స్ ఐడీ పాస్వర్డ్ కావాలని కోరాడు. లాక్డౌన్ తర్వాత పాస్వర్డ్ మార్చుకోండి అని అతడికి సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. దీనిని స్క్రీన్‌షాట్ తీసి ట్వీట్ చేసిన ఛెత్రి.. ఇతడి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటానని రాసుకొచ్చాడు.
అభిమాని కోరికకు ఆశ్చర్యపోయిన ఫుట్‌బాలర్ ఛెత్రి - indian footballer Sunil Chhetri news
తన అభిమాని అడిగిన కోరికకు ఆశ్చర్యపోయిన ఫుట్‌బాలర్ ఛెత్రి.. ఆ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ స్క్రీన్‌షాట్ వైరల్‌గా మారింది.
![అభిమాని కోరికకు ఆశ్చర్యపోయిన ఫుట్‌బాలర్ ఛెత్రి అభిమాని కోరికతో ఆశ్చర్యపోయిన ఫుట్‌బాలర్ ఛెత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7039824-447-7039824-1588489648967.jpg)
ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి
"జెర్సీ, ఫొటోపై ఆటోగ్రాఫ్, పోస్ట్‌కు రిప్లై, పెంపుడు కుక్కలకు విషెస్ చెప్పమని వీడియోలు.. ఇవన్నీ అయిపోయాయి. ఇతడి ప్రాధాన్యత చూడండి. అయితే ఈ డిమాండ్‌ను నేను పరిగణలోకి తీసుకోవాలని అనుకుంటున్నాను" -సునీల్ ఛెత్రి, ప్రముఖ ఫుట్‌బాలర్
కొవిడ్-19ను అరికట్టటంలో భాగంగా ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్‌తో కలిసి పనిచేస్తున్నాడు ఛెత్రి. ఇందులో భాగంగా ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
TAGGED:
chetri screenshot tweet