తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళా ఫుట్​బాల్​ జట్టు ఒలింపిక్స్​ ఆశలు గల్లంతు - india

ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​లో చోటు దక్కాలంటే కచ్చితంగా గెలవాల్సిన చోట చతికిలపడింది భారత మహిళా ఫుట్​బాల్​ జట్టు. మంగళవారం మయన్మార్​తో జరిగిన మ్యాచ్​ 3-3తో డ్రా చేసుకుంది భారత్​.

ఒలింపిక్స్​ ఆశలు గల్లంతు...మహిళా ఫుట్​బాల్​ డ్రా

By

Published : Apr 10, 2019, 10:40 AM IST

మయన్మార్​తో హోరాహోరీగా సాగిన ఫుట్​బాల్​ మ్యాచ్​ను భారత్​ డ్రాగా ముగించింది. ఆట గెలిస్తే ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​​ మూడో దశకు చేరుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది భారత జట్టు. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

  • గ్రూప్‌-ఎ లో మొదటి స్థానంలో నిలిస్తే భారత్‌ ముందంజ వేసేది. అయితే గ్రూప్​ దశలో ఆడిన 3 మ్యాచ్‌లలో కలిపి 7 పాయింట్లతో నిలిచాయి భారత్, మయన్మార్‌. పాయింట్లు సమంగా ఉన్నా గోల్స్ పరంగా మయన్మార్​ అగ్రస్థానం కైవసం చేసుకుంది.

మయన్మార్​ - భారత్​ మ్యాచ్‌లో మన ఆటగాళ్లు సంధ్య రంగనాథన్‌, సంజు, రత్నబాల ఒక్కో గోల్​ చేశారు. మయన్మార్‌ తరఫున విన్‌ టున్‌ హ్యాట్రిక్​ గోల్స్​ సాధించింది.

ABOUT THE AUTHOR

...view details