తెలంగాణ

telangana

ETV Bharat / sports

2022 ఫిఫా ప్రంపచకప్​లో భారత్​కు భలే ఛాన్స్​!

ఫిఫా ప్రపంచకప్-2022​లో ఆసియా దేశాల కోసం ఎంపికకు తీసిన రెండో రౌండ్​ డ్రాలో భారత్​ చోటు దక్కించుకుంది. 'గ్రూప్​-ఈ'లో చిన్న జట్లయిన ఖతార్​, ఒమన్​, అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​లతో పోటీ పడనుంది. సెప్టెంబర్​ 5 నుంచి అన్ని జట్లు రౌండ్​ రాబిన్​ పద్దతిలో మ్యాచ్​లు ఆడనున్నాయి.

By

Published : Jul 18, 2019, 11:35 AM IST

సాకర్

క్రికెట్ ప్రపంచకప్​కు హాట్​ఫేవరెట్ అయిన భారత్... ఫుట్​బాల్​ వరల్డ్​కప్​కు మాత్రం అర్హత సాధిస్తే చాలు అంటుంటారు చాలామంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. 2022 ఫిఫా ప్రపంచకప్​ అర్హత పోటీల కోసం ఆసియా దేశాల ఎంపికకు తీసిన డ్రాలో భారత్​కు చోటు దక్కింది. 40 ఆసియా దేశాలను 8 గ్రూపులుగా విభజించగా.. ఇండియాకు గ్రూప్​- ఈలో అవకాశం దక్కింది.గ్రూప్​ - ఈలో ఖతార్​, ఒమన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ ​జట్లతో పోటీపడనుంది భారత్​. ఇందులో విజేతగా నిలిస్తే ఖతార్​లో జరిగే 2022 ప్రపంచకప్​ తుది అర్హత పోటీలకు ఎంపిక అవుతుంది భారత్​.

ఫైనల్ క్వాలిఫైయింగ్​ పోటీల్లో ముందు వరుసలో ఉంటే అప్పుడు 2022 సాకర్​ ప్రపంచకప్​లో భారత్​కు చోటు దక్కుతుంది. అంతేకాకుండా చైనాలో 2023లో జరగనున్న ఆసియా కప్‌ క్వాలిఫైయింగ్​ ఫైనల్​కూ అర్హత లభిస్తుంది.

జపాన్​, కొరియా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇరాక్​, ఉజ్బెకిస్థాన్​ వంటి మేటి జట్లు ఉన్న గ్రూపులో పడకపోవడం వల్ల ఇండియాకు కలిసొచ్చే అవకాశముంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 2020 జూన్ 9 వరకు ఈ రెండో రౌండ్​ మ్యాచ్​లు జరగనున్నాయి. గ్రూప్ విజేతలతో పాటు నలుగురు రన్నరప్స్​ కలిపి మొత్తం 12 జట్లను తదుపరి రౌండ్‌కు పంపిస్తారు.

8 గ్రూపుల్లోని జట్లు ఇవే..

  • గ్రూప్ - ఎ: చైనా, సిరియా, ఫిలిప్పీన్స్, మాల్దీవులు, గువామ్
  • గ్రూప్ - బి: ఆస్ట్రేలియా, జోర్డాన్​, చైనీస్ తైపీ, కువైట్, నేపాల్
  • గ్రూప్ - సి: ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, హాంకాంగ్, కాంబోడియా
  • గ్రూప్ - డి: సౌదీ అరేబియా, ఉజ్బెకిస్థాన్​, పాలస్తీనా, యెమెన్, సింగపూర్
  • గ్రూప్ - ఈ: బంగ్లాదేశ్, ఒమన్, భారత్​, ఆఫ్గానిస్థాన్​, ఖతార్
  • గ్రూప్ - ఎఫ్: జపాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్​, మయన్మార్, మంగోలియా
  • గ్రూప్ - జి: యుఏఈ, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా
  • గ్రూప్ - హెచ్: కొరియా రిపబ్లిక్, లెబనాన్, కొరియా డీపీఆర్, తుర్క్మెనిస్థాన్​, శ్రీలంక.

ఇది చదవండి: 'స్టోక్స్​ ఆ నాలుగు పరుగులు వద్దన్నాడు'

ABOUT THE AUTHOR

...view details