తెలంగాణ

telangana

ETV Bharat / sports

సౌత్​ ఆసియన్​ ఫుట్​బాల్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో నేపాల్​

సౌత్​ ఆసియన్​ ఫుట్​బాల్​ ఫెడరేషన్​ (శాఫ్​) మహిళల ఛాంపియన్​షిప్​లో నేపాల్​ సత్తా చాటింది. శ్రీలంకను 4-0 తేడాతో ఓడించి  టైటిల్​ పోరుకు సిద్ధమవుతోంది.

By

Published : Mar 20, 2019, 6:27 PM IST

శాఫ్​​ ఛాంపియన్​షిప్ ఫైనల్లో నేపాల్​

ఐదోసారి జగుతున్న శాఫ్​ ఛాంపియన్​షిప్​లో బుధవారం.. నేపాల్​-శ్రీలంక మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది​​. బిరత్​నగర్​లో జరిగిన ఈ మ్యాచ్​లో నేపాల్​ విజయం సాధించింది.

నేపాల్​, శ్రీలంక మధ్య సెమీఫైనల్​
  • మరోవైపు డిఫెండింగ్​ ఛాంపియన్ భారత్​.. నేడు బంగ్లాదేశ్​తో రెండో సెమీఫైనల్​ ఆడనుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు నేపాల్​తో తుదిపోరులో తలపడతుంది.

రికార్డులు...

శాఫ్​ టోర్నమెంట్​ను 2010లో ప్రారంభించారు. అప్పటి నుంచి భారత్​ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. నాలుగు సీజన్లలో భారత్​ ఒక్క మ్యాచ్​లోనూ ఓడిపోలేదు. గత ఏడాది ఫైనల్లో బంగ్లాదేశ్​తో తలపడి.. 3-1తో తేడాతో మట్టికరిపించి కప్పు సొంతం చేసుకుంది భారత్​.

భారత మహిళల ఫుట్​బాల్​ జట్టు
  • అదే ఏడాది నవంబరులో 7-1 తేడాతో బంగ్లాను మళ్లీ ఓడించింది భారత్. ఫలితంగా 2020 ఒలింపిక్స్​ క్వాలిఫయర్ తొలి రౌండుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్​ మయన్మార్​లో జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details