భారత దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు భైచుంగ్ భుటియా పేరుతో సిక్కింలో ఓ స్టేడియం నిర్మితమైంది. 15వేల మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ మైదానాన్ని.. కరోనా పరిస్థితులు చక్కబడ్డిన తర్వాత ప్రారంభించనున్నారు. భుటియా పుట్టిన ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ స్టేడియంలో.. ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. దేశంలో సాకర్ ఆటగాడి పేరుతో నిర్మించిన తొలి స్టేడియం ఇదే.
ఈ గౌరవం దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు భుటియా. భారత్ తరపున 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి ఫుట్‌బాల్ ప్లేయర్ ఇతడు.