ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) యూరో కప్ ప్రెస్ మీట్లో కోకా కోలా(Coca Cola) బాటిల్‌ను పక్కనపెట్టిన వీడియో వైరల్ అవ్వడం ఎవ్వరూ మర్చిపోయి ఉండరు. 'కార్బైడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి.. నీరు తాగండి' అంటూ అతడు సూచించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సదరు కంపెనీకి దాదాపు రూ.30 వేల కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా!.
అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా మరో ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనార్డో బోనుచి యూరో కప్ ఫైనల్ అనంతరం ప్రెస్మీట్లో కోకా కోలా డ్రింక్‌ను ఎంతో ఇష్టంగా తాగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు 'రొనాల్డో అలా.. లియోనార్డో ఇలా' అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియోలను ట్రోల్ చేస్తున్నారు.