స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు స్వస్తి చెప్పాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాడు స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ. లా లిగా లీగ్‌లో ఈ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలనందించి వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు తెలిపాడు. బార్కా తరఫున మెస్సీకి ఇదే చివరి సీజన్. తాజాగా ఈ విషయంపై స్పందించిన బార్సిలోనా హెడ్ కోచ్ రొనాల్డ్ కోమన్.. మెస్సీ బయటకు వెళితే జట్టు తరఫున ఎవరు గోల్స్ చేస్తారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
"లా లిగాలో జట్టు తరఫున 30 గోల్స్ సాధించాడు. ఎన్నో విజయాలను అందించాడు. అతడు జట్టుతో కొనసాగాలన్నది మా అందరి కోరిక. ఎందుకంటే ఒకవేళ అతడు జట్టు నుంచి వెళిపోతే బార్కా తరపున గోల్స్ ఎవరు చేస్తారో అర్థం కావట్లేదు."