తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫుట్​బాల్​ కాదు అదే ఎక్కువగా చూస్తా: రొనాల్డో - పోర్చుగల్ ఆటగాడు

స్టార్ ఫుట్​బాలర్ అతడు.. కానీ ఆ గేమ్​లు దాదాపుగా చూడడు. టీవీల్లో మ్యాచ్​లు వస్తున్నా సరే వేరే గేమ్స్​ చూసేందుకు ఇష్టపడతాడు. ఇంతకీ ఆ ఫుట్​బాలర్ ఎవరు? ఏ క్రీడల్ని ఎక్కువగా చూస్తాడు?

I Prefer Watching Boxing Or UFC Rather Than Football: Cristiano Ronaldo
టీవీలో ఫుట్​బాల్​ కంటే ఆ మ్యాచ్​లనే ఎక్కవగా చూస్తా:రోనాల్డో

By

Published : Dec 16, 2020, 12:16 PM IST

అంతర్జాతీయ ఫుట్​బాల్​లో 100 గోల్స్​తో రికార్డు సృష్టించిన స్టార్ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డో. అయితే టీవీలో మాత్రం ఫుట్​బాల్​ కంటే బాక్సింగ్​ లేదా యూఎఫ్​సీ మ్యాచ్​లు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడతానని అన్నాడు. దాని వల్లే ఫుట్​బాల్​ బాగా ఆడుతున్నానని చెప్పాడు.

"ఫుట్​బాల్​ ఆడడం నా వృత్తి. కానీ, టీవీలో ఇతర క్రీడలను ఎక్కువగా చూస్తాను. బాక్సింగ్​, ఫుట్​బాల్​ చూడాలా అన్న అవకాశం వచ్చినప్పుడు నేను బాక్సింగ్​ చూసేందుకే ఆసక్తి చూపిస్తాను. బాక్సింగ్​ ప్రాక్టీసు చేయడం వల్ల ఫుట్​బాల్​లో బాగా ఆడగలుగుతున్నానని నమ్ముతాను. మాంచెస్టర్​ యునైటెడ్​లో ఉన్నప్పుడు ఓ కోచ్​ నాతో బాక్సింగ్​ చేశారు. 33 ఏళ్ల వయస్సులోనూ నేను ఫుట్​బాల్​ను ఆడాలని అనుకుంటున్నాను. మన శరీరాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు కానీ, అంతకంటే ముందు మానసికంగా సన్నద్ధమవ్వాలి"

-- క్రిస్టియానో రొనాల్డో, ప్రముఖ ఫుట్​బాలర్

సెరీ-ఏ టోర్నీలో 50 గోల్స్ పూర్తి చేశాడు రొనాల్డో. ఫలితంగా ఈ టోర్నీలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రీమియర్​ లీగ్​,​ లా లిగాలోనూ 50 గోల్స్​ చేసిన తొలి ఆటగాడు రొనాల్డోనే. యూరప్​లోని ఐదు ప్రముఖ లీగ్​ల్లో 400 విజయాలు నమోదు చేసి, ఈ శతాబ్దంలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఇదీ చూడండి:రొనాల్డో ఇంటికి రూ.75 కోట్ల విలువైన అతిథి!

ABOUT THE AUTHOR

...view details