తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫుట్​బాల్​ టోర్నీకి హైదరాబాద్.. జెర్సీ ఆవిష్కరణ - హీరో వెంకటేశ్

ఐఎస్ఎల్​లో​ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది హైదరాబాద్​ ఎఫ్​సి. తొలిసారి బరిలోకి దిగుతున్న ఈ జట్టు జెర్సీని హైదరాబాద్​లో ఆవిష్కరించారు.

ఫుట్​బాల్​ టోర్నీకి హైదరాబాద్.. జెర్సీ ఆవిష్కరణ

By

Published : Sep 29, 2019, 5:33 PM IST

Updated : Oct 2, 2019, 11:49 AM IST

2019-20 సీజన్​ ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)​​లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది హైదరాబాద్​ ఫుట్​బాల్ క్లబ్. ఆదివారం భాగ్యనగరంలో జట్టు జెర్సీని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హీరో వెంకటేశ్​ హాజరయ్యాడు. ఇటీవలే హెచ్​సీఏ అధ్యక్షుడిగా ఎంపికైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్​ ఫుట్​బాల్ క్లబ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం

సంప్రదాయ నిజాం షేర్వాణీ స్ఫూర్తిగా తీసుకుని, హైదరాబాద్​ నగర విశిష్టతను పెంపొందించేలా ఈ జెర్సీని రూపొందించారు.

"హైదరాబాద్​ ఫుట్​బాల్​ క్లబ్ ప్రారంభమవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సీజన్​లో మన జట్టు ప్రత్యర్థులకు గట్టి పోటీదారు అవుతుందని భావిస్తున్నాను. ఫైనల్లో బెంగళూరు, చెన్నైతో తలపడుతుందని అనుకుంటున్నాను(నవ్వుతూ)" -వెంకటేశ్, కథానాయకుడు

స్కూల్​డేస్​లో ఎక్కువగా సాకర్​ ఆడేవాడినని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్. అయితే ఆ తర్వాత క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకున్నానని చెప్పాడు.

వచ్చే నెల 20 నుంచి ఐఎస్ఎల్ ఆరో సీజన్ ప్రారంభం కానుంది. హైదరాబాద్​ ఎఫ్​సి.. 25న కోల్​కతాలో తొలి మ్యాచ్, నవంబరు 2న హోమ్​ గ్రౌండ్​లో మొదటి మ్యాచ్​ ఆడనుందని చెప్పారు జట్టు యజమాని వరుణ్ త్రిపురనేని.​

ఇది చదవండి: అత్యుత్తమ గోల్​ కన్నా శృంగారమే మిన్న: స్టార్ ఫుట్​బాలర్ రొనాల్డొ

Last Updated : Oct 2, 2019, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details