స్పెయిన్లోని బార్సిలోనా - రియల్ మాడ్రిడ్ మ్యాచ్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఓ గ్రాఫిటీ కళాకారుడు వేసిన ఆర్ట్ ఈ మ్యాచ్కు కొత్త చిక్కులు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఆటగాళ్లు ముద్దు పెట్టుకుంటున్నట్లు పెయిటింగ్ చేసి కవ్వించాడు.
టీవీబాయ్ అని పిలిచే ఈ ఆర్టిస్ట్ బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పీక్, రియాల్ మాడ్రిడ్ కెప్టెన్ సెర్జియో రామోస్ ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటున్నట్లు బార్సిలోనాలోని నోవూ స్టేడియం సమీపంలో పెయింటింగ్ చేశాడు. అంతేకాకుండా 'కిస్ అండ్ టాక్' (ముద్దు పెట్టి మాట్లాడు) అని క్యాప్షన్ పెట్టి రెచ్చగొట్టాడు.