ఫుట్‌బాల్‌లో ఏడాది మొత్తంలో అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాడికిచ్చే గోల్డెన్ బాల్ అవార్డు ఈసారి ఇవ్వబోవట్లేదు. కరోనా మహమ్మారి కారణంగా సీజన్‌కు అంతరాయం కలగడమే ఇందుకు కారణం. 1956 నుంచి ఫ్రాన్స్ ఫుట్‌బాల్ మ్యాగజైన్ ఈ పురస్కారాన్ని క్రమం తప్పకుండా ఇస్తోంది. తొలి అవార్డును 'స్టాన్లీ మాథ్యూ' అందుకున్నాడు.
64 ఏళ్లలో తొలిసారి 'గోల్డెన్ బాల్' అవార్డు రద్దు!
ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఫుట్‌బాల్ సీజన్‌కు అంతరాయం కలిగింది. దీంతో పాటు ఈ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఇచ్చే 'గోల్డెన్ బాల్' అవార్డును ఈ ఏడాది రద్దు చేసినట్లు సమాచారం.
కరోనా కారణంగా గోల్డెన్ బాల్ అవార్డు రద్దు
అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఈ పురస్కారాన్ని అందుకోగా.. మరో దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అయిదుసార్లు సాధించాడు. 2018 నుంచి మహిళలకూ ఈ అవార్డును అందజేస్తున్నారు.