తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ బుడ్డోడు.. ఫుట్​బాల్​ ఆటలో గట్టోడు..! - viral

ఇరాన్​కు చెందిన అరట్ హొస్సెనీకి ఐదేళ్లు. ఫుట్​బాల్​ ఆటలో అనుభవజ్ఞుడిలా మైదానంలో రెచ్చిపోతున్నాడు. తన ప్రతిభతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. పిల్లాడి వీడియోపై భారత బిజినెస్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర స్పందించారు.

ఫుట్​బాల్

By

Published : May 18, 2019, 6:56 PM IST

ఐదారేళ్ల పిల్లలు ఆటల్లో నిమగ్నమై ఉండటం సహజమే. కానీ ఇరాన్​కు చెందిన అరట్ హొస్సెనీ ఫుట్​బాల్​ ఆటలో ప్రోఫెషనల్ ప్లేయర్​లా ఆడుతున్నాడు. మైదానంలో వేగంగా కదులుతూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాడీ ఐదేళ్ల అరట్​. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పొడవైన జుట్టుతో ఉండి కాళ్లను మెరుపులా కదిలిస్తున్నాడు అరట్. అతడి వేగానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. జూనియర్ మెస్సీ వచ్చాడంటూ నెట్టింట బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ బుడ్డోడు ఇన్ స్టాలో 20 లక్షల ఫాలోవర్లను సంపాదించాడు.

ఈ వీడియోపై భారత బిజినెస్ దిగ్గజం ఆనంద్​ మహీంద్రా స్పందించారు. వాట్సాప్​లో ఆ వీడియో చూశానని, పొడుగు జుట్టు ఉండటం వల్ల అమ్మాయనుకున్నానని తెలిపారు. ఐదేళ్ల పిల్లాడు ఇంత బాగా ఫుట్​బాల్ ఆడుతున్నాడంటే నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఫుట్​బాల్​ నైపుణ్యం​తో బుడతడు తనను ఆకట్టుకున్నాడని ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details