తెలంగాణ

telangana

ETV Bharat / sports

పిన్న వయసులో సాకర్​ అవకాశం.. తల్లిదండ్రుల సేవాభావం - పిన్న వయసులో ఘనత

తల్లిదండ్రుల ఆశయం వారి పిల్లలు ఉన్నత శిఖరాలు చేరుకోవడమే. మనం ఏదైనా సాధిస్తే మనకన్నా ఎక్కువ సంతోషించింది వారే. హైదరాబాద్​కు చెందిన ఆదర్శ్ నారాయణపురం​ పిన్న వయసులోనే సాకర్​ లీగ్​ ఆడే ఛాన్స్​ కొట్టేశాడు. దీంతో వారి తల్లిదండ్రులు ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని బసవతారకం ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదానం చేశారు.

foot ball player adarsh
చిన్న వయసులోనే సాకర్​ ఆడే ఛాన్స్

By

Published : Mar 27, 2021, 7:55 PM IST

కుమారుడి ఘనతను ఆ తల్లిదండ్రులు పేదలతో పంచుకున్నారు. అన్నదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన పుట్‌బాల్‌ క్రీడకారుడు ఆదర్శ్‌ నారాయణపురం(18) అరుదైన ఘనత సాధించారు. అతి పిన్న వయసులోనే సాకర్‌ లీగ్‌లో అడే అవకాశం దక్కించుకున్నాడు. అతడు ప్రస్తుతం యూరప్​లో జరుగుతున్న సాకర్‌ టోర్నమెంట్‌ జూనియర్‌ విభాగంలో అడనున్నారు.

చిన్న వయసులోనే సాకర్​ ఆడే ఛాన్స్ ఆదర్శ్​

తల్లిదండ్రుల సేవాభావం

సాకర్‌ టోర్నమెంట్‌లో తమ కుమారుడికి ఆడే అవకాశం లభించిడంతో ఆదర్శ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆసుపత్రి వద్ద 600 మంది పేదలకు అన్నదానం చేశారు.

రీచ్​ ఆవుట్​ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు:

ఒకవైపు పుట్‌బాల్‌ ఆడుతునే మరో వైపు తన వంతుగా సామాజానికి సేవా కార్యక్రమాలు చేసేందుకు 'రీచ్‌ అవుట్‌' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నట్లు ఆదర్శ్ తల్లిదండ్రులు సుధాకర్‌రావు‌, విజయలక్ష్మి తెలిపారు. కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మాస్క్‌లు, శానిటైజర్లతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. తమ కుమారుడు ప్రస్తుతం స్పెయిన్​లో ఉన్నాడని.. అతను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సాకర్‌ టోర్నమెంట్‌లో ఇండియా తరఫున కేవలం 8 మందికే ఆడే అవకాశం వస్తుందని.. అందులో మా అబ్బాయికి ఉండడం చాలా ఆనందంగా ఉందని ఆదర్శ్​ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఆదర్శ్​ తల్లిదండ్రుల సంతోషం

ఇదీ చూడండి:తీర్మానం చేసి నిధులు ఖర్చు చేసుకోవచ్చు'

ABOUT THE AUTHOR

...view details