ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో(Fifa Worldcup) భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సునీల్ ఛెత్రి(Sunil Chhetri) రెండు గోల్స్ చేయడం వల్ల 2-0తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. 79వ నిమిషంలో గోల్‌తో ఛెత్రి జట్టు ఖాతా తెరిచాడు.
రెండో అర్ధభాగంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆషిక్ కురునియన్ ఎడమ నుంచి ఇచ్చిన క్రాస్‌ను ఛెత్రి తలతో నెట్లోకి కొట్టాడు. ఇంజురీ సమయంలో మరో గోల్ (90+2)తో ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టుకు ఇదే తొలి విజయం. 11 అర్హత మ్యాచ్‌ల తర్వాత భారత్‌కు విజయం దక్కింది.