ఫిఫా అండర్-17 మహిళా ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా వాయిదా వేస్తునట్లు పాలక మండలి తెలిపింది. నవంబర్‌లో భారత్ వేదికగా ఈ మెగాటోర్నీ జరగాల్సి ఉంది.
"పాలకమండలి నిర్ణయం మేరకు ఫిఫా అండర్-20 మహిళా ప్రపంచకప్‌తో పాటు ఫిఫా అండర్-17 మహిళా ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తాం."