తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫిఫా​ ర్యాంకింగ్స్​: భారత్​ 'వంద' ఆశలు ఆవిరి - అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా)

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) తాజా ర్యాంకింగ్స్​ను గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్​ రెండు స్థానాలు కోల్పోయి 103వ స్థానంలో నిలిచింది.

ఫిఫా​ ర్యాంకింగ్స్​: భారత్​ రెండు స్థానాలు డౌన్​

By

Published : Jul 26, 2019, 1:55 PM IST

టాప్​-100లో నిలవాలన్న భారత ఫుట్​బాల్​ జట్టుకు నిరాశ ఎదురైంది. ఫిఫా గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత జట్టు రెండు స్థానాలు కోల్పోయి 103వ స్థానంలో నిలిచింది. జులై మొదటి వారంలో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో... తజకిస్థాన్​, డీపీఆర్​ కొరియా చేతిలో ఓడిపోయింది భారత జట్టు. ప్రస్తుతం టీమిండియా​ ఖాతాలో 1219 పాయింట్లు ఉన్నాయి. టాప్​-5​లో బెల్జియం, బ్రెజిల్​, ఫ్రాన్స్​, ఇంగ్లాండ్​, ఉరుగ్వే నిలిచాయి.

ఇంటర్​కాంటినెంటల్​ కప్​లో భారత్​కు నిరాశ

1996 సంవత్సరంలో భారత ఫుట్​బాల్​ జట్టు 94వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమం​.

ఇవీ చూడండి...మెస్సీని వెనక్కి నెట్టిన సునీల్ ఛెత్రి

ABOUT THE AUTHOR

...view details