తెలంగాణ

telangana

ETV Bharat / sports

2030 ఫిఫా ప్రపంచకప్​ నిర్వహణ చేపట్టేందుకు భారీ పోటీ - ఫిఫా వరల్డ్​కప్​

ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆటల్లో తొలిస్థానంలో ఉండేది ఫుట్​బాల్. మరి అలాంటి ఆటకు చెందిన ఫిఫా ప్రపంచకప్ నిర్వహణను ఏ దేశం కాదంటుంది చెప్పండి. 2030 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం ఆసక్తిగల పలు దేశాలు బిడ్ దాఖలు చేశాయి.

2030 ఫిఫా ప్రపంచకప్​ నిర్వహణకు భారీ పోటీ

By

Published : Mar 21, 2019, 3:29 PM IST

2030 ఫిఫా ప్రపంచకప్​ నిర్వహణకు అర్జెంటీనా, చిలీ, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు కలిసికట్టుగా బిడ్​ దాఖలు చేశాయి. ఈ నాలుగు దేశాల అధినేతలు అర్జెంటీనాలోని బ్యూనస్​ ఎయిర్స్​లో సమావేశమై ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

  • ఒక ప్రత్యేకమైన లోకల్​ కమిటీని ఏర్పాటు చేయాలని నాలుగు దేశాలు నిశ్చయించుకున్నాయి. ప్రతి దేశం దక్షిణ అమెరికా ఫుట్​బాల్​ ఫెడరేషన్​కి సహకరించాలని తీర్మానించారు. దీనిపై బ్యూనస్​ ఎయిర్స్​లో ఏప్రిల్​ 8న చర్చించనున్నారు.

ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్యానికి మొదటగా అర్జెంటీనా, ఉరుగ్వే 2017లో సంయుక్త బిడ్​ను దాఖలు చేశాయి. అనంతరం పరాగ్వే సైతం బిడ్​ వేసింది. చివరగా చిలీ ఈ దేశాలతో జతకట్టింది.' అయితే నిర్వహణ కోసం బొలీవియా సైతం ఈ నలుగురితో కలిసేందుకు సమాలోచనలు చేస్తోంది.

తొలిసారి ఉరుగ్వేలో:

తొలి ప్రపంచకప్ 1930లో​ ఉరుగ్వేలో జరిగింది. ఫైనల్ మ్యాచ్​లో అర్జెంటీనాను 4-2తో ఓడించి విజేతగా నిలిచింది అతిథ్య జట్టు.

విపరీతమైన పోటీ:
ఈ నాలుగు దక్షిణ అమెరికా దేశాలకు మొరాకో నుంచి పోటీ ఎదురవుతోంది. వీటితో పాటు బ్రిటన్​, ఐర్లాండ్​ కలిసి జాయింట్​ బిడ్​ వేశాయి. గ్రీస్​, సెర్బియా, బల్గేరియా, రొమేనియా దేశాలు మరో జట్టుగా బిడ్డింగ్​లో పాల్గొన్నాయి.

పెద్ద టోర్నీ:
2022లో ఫిఫా ప్రపంచకప్​ ఖతార్​లో జరగనుంది. 2026లో ఈ మెగా టోర్నీని అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2030 టోర్నీకి నాలుగు ఖండాల నుంచి 48 జట్లు రానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details