ప్రపంచవ్యాప్తంగా కరోనా నియంత్రణలోకి రాని కారణంగా 2021 పురుషుల అండర్-17, 20 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను రద్దు చేసింది ఫిఫా. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ మెగా టోర్నీ 2023 ఎడిషన్ ఆతిథ్య హక్కులను పెరు, ఇండోనేసియాకు ఇచ్చింది. అండర్-17కు పెరు, అండర్-20కి ఇండోనేసియా ఆతిథ్యమివ్వనున్నాయి.
"కరోనా ఉద్ధృతి, అంతర్జాతీయ ప్రయాణాల ఆంక్షల వల్ల పరుషుల అండర్-17, అండర్-20 టోర్నీలను రద్దు చేయాలని నిర్ణయించాం. అయితే ఈ ఎడిషన్‌ను ఆతిథ్యం ఇవ్వనున్న వేదికల్లో 2023 టోర్నీలు నిర్వహించేలా మండలి ఆమోదం తెలిపింది." అని ఫిఫా వెల్లడించింది.