ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది భారత్. ఖతార్ లాంటి పెద్ద జట్టును నిలువరించిన టీమిండియా బలహీన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక డ్రాతో సరిపెట్టుకుంది.
మంగళవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో 1-1 తేడాతో డ్రాగా ముగించింది భారత్. 42వ నిమిషంలోనే సాద్ ఉద్దీన్ గోల్ కొట్టి బంగ్లాను ఆధిక్యంలో నిలిపాడు. స్కోరు సమం చేయడానికి టీమిండియా ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమైంది. చివరికి 88వ నిమిషంలో ఆదిల్ ఖాన్ గోల్ కొట్టి భారత్‌ను పరాజయం నుంచి తప్పించాడు.