తెలంగాణ

telangana

ETV Bharat / sports

Soccer Players: అఫ్గాన్​ మహిళా ఫుట్​బాలర్లు సురక్షితం - అఫ్గానిస్థాన్​ మహిళా ఫుట్​బాల్​ ప్లేయర్లు

తాలిబన్ల చేతిలో చిక్కున్న అఫ్గానిస్థాన్​ మహిళా ఫుట్​బాల్​ ప్లేయర్లు (Soccer Players) సురక్షితంగా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. ఆటగాళ్లతో పాటు కుటుంబసభ్యులు, సహాయ సిబ్బంది.. మొత్తం 75 మందితో విమానం కాబుల్​ నుంచి బయటపడేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

afghan football players
అఫ్గానిస్థాన్​ మహిళా ఫుట్​బాల్​ ప్లేయర్లు

By

Published : Aug 25, 2021, 6:41 AM IST

అమ్మాయిలు బయటికి రావడాన్ని, బయట బురఖాలు కాకుండా వేరే దుస్తులు ధరించడాన్ని ఏమాత్రం సహించరు తాలిబన్లు. అలాంటింది వాళ్లు మైదానాల్లోకి వెళ్లి ఆటలు ఆడతామంటే, పొట్టి దుస్తులు ధరిస్తామంటే ఒప్పుకుంటారా? అందుకే అఫ్గానిస్థాన్​ తాలిబన్ల చేతికి చిక్కినప్పటి నుంచి తమ పరిస్థితి ఏంటా అని ఆ దేశ ఫుట్​బాల్​ క్రీడాకారిణులు (Soccer Players) బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ భద్రత పట్ల తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే వాళ్లందరినీ సురక్షితంగా అఫ్గాన్​ రాజధాని కాబుల్​ నుంచి బయట పడేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

అఫ్గాన్​ జాతీయ మహిళల సాకర్​ జట్టులో భాగమైన క్రీడాకారిణులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది మొత్తాన్ని ఓ ప్రత్యేక విమానంలో కాబుల్​ నుంచి తరలించారు. మొత్తం 75 మందితో ఈ విమానం మంగళవారం కాబుల్ నుంచి బయల్దేరింది. 2007లో అఫ్గానిస్థాన్​ జాతీయ మహిళల సాకర్ జట్టు ఏర్పాటైంది. అమ్మాయిలు ఫుట్​బాల్​ ఆడటాన్ని తాలిబన్లు ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు సభ్యులను ఏం చేస్తారో అన్న ఆందోళన వ్యక్తమైంది.

ఇదీ చదవండి:paralympics 2020: బుధవారం భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే

ABOUT THE AUTHOR

...view details