తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంజాబీ సాంగ్​కు.. ఫ్రెంచ్ ఫుట్​బాల్ ప్లేయర్ చిందులు - patrice evra panjabi dance

ఫ్రెంచ్ ఫుట్​బాల్ ఆటగాడు ప్యాట్రిస్ ఎవ్రా.. కుర్తా, పైజామా ధరించి పంజాబీ సాంగ్​కు చిందులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Ex-Manchester United left-back Patrice Evra dons sherwarni and does bhangra for Indian fans
ఫ్యాట్రిస్ ఎవ్రా

By

Published : Dec 10, 2019, 11:51 AM IST

ఫ్రెంచ్ ఫుట్​బాల్​ స్టార్ ప్యాట్రిస్ ఎవ్రా.. ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్​గా ఉంటాడు. క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి.. పంజాబీ పాటకు నర్తిస్తూ అతడు పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

'ముండియా తో బాచ్ కే రహీ' అనే పంజాబీ పాటకు తగ్గట్లుగా డ్యాన్స్ చేస్తూ ప్యాట్రిస్ ఆకట్టుకున్నాడు. అంతేకాదు హృదయాన్ని హత్తుకునేలా పోస్ట్ పెట్టి భారత అభిమానుల అభిమానాన్ని చూరగొంటున్నాడు.

"నా భారతీయ అభిమానులుకు ప్రేమతో సందేశాన్ని పంపిస్తున్నా. ద్వేషించడం మానేసి.. ఒకరినొకరు ప్రేమించడం మొదలు పెట్టండి. మనమందరం సహోదరులం. నేను ఫ్రెంచ్​ వాడినో, సెనెగల్​కు చెందిన వ్యక్తిగానో కాదు.. ఓ భారతీయుడుగా ఈ సోమవారం మీ ముందుకు వచ్చా" - ప్యాట్రిస్ ఎవ్రా, ఫ్రెంచ్ ఫుట్​బాల్ ప్లేయర్.

ఫ్రాన్స్​ తరఫున 2004 నుంచి 2016 వరకు 81 మ్యాచ్​లు ఆడాడుప్యాట్రిస్. 2010 ఫిఫా ప్రపంచకప్​లో 5 మ్యాచ్​లకు కెప్టెన్​గానూ వ్యవహరించాడు. 2018లో ఆటకు గుడ్​బై చెప్పాడు.

ఇదీ చదవండి: సింగర్​గా మారిన మిస్టర్ కూల్.. బిగ్ బీ పాటతో ఫుల్​ జోష్​

ABOUT THE AUTHOR

...view details