ఆద్యంతం ఉత్కంఠగా సాగిన యూరో కప్ తొలి సెమీస్‌లో ఇటలీ గెలిచింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో 4-2 తేడాతో ఇటలీ జట్టు స్పెయిన్‌ను ఓడించింది. దీంతో ఇటలీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తంగా స్పెయిన్ జట్టే ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోయింది. 60వ నిమిషంలో ఫెడెరికో చియెసా గోల్ కొట్టి ఇటలీని ఆధిక్యంలో తీసుకెళ్లాడు. స్పెయిన్ ఆటగాడు అల్‌వరో మొరాటా 80వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. అయితే నిర్ణీత సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి.
అదనపు సమయంలో కూడా రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఇక పెనాల్టీ సమరంలో చెరి ఆరు అవకాశాల్లో ఇటలీ నాలుగు చేయగా, స్పెయిన్ రెండు చేసింది. స్కోర్ 3-2తో ఉన్న సమయంలో ఇటలీ ఆటగాడు జోర్గిన్హో నిర్ణయాత్మక పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచాడు. దీంతో ఇటలీ ఘన విజయం సాధించింది.
కోపా కప్‌లో బ్రెజిల్..