యూరో కప్-2020 టోర్నీలో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి విజేతగా నిలిచింది ఇటలీ. అయితే ఈ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభమవుతుందనగా.. యూకేలోని వెంబ్లే స్టేడియం బయట అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. అయితే ఇందుకు గల కారణమేంటనేది తెలియలేదు. మైదానానికి వెళ్లే దారులన్నీ ఫ్యాన్స్ కొట్లాటలతో నిండిపోయాయి. ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకుంటూ, చేతిలో ఉన్న వస్తువులతో కొట్టుకున్నారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. టికెట్ లేకున్నా కొంతమంది ప్రేక్షకులు స్టేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. మైదానం వెలుపల అమర్చిన బారికేడ్లను విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మితిమీరి ప్రవర్తించిన కొందరిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యూరో కప్: ఫ్యాన్స్ కొట్లాటతో రణరంగంగా మారిన స్టేడియం - యూరో కప్‌కు ముందు అభిమానుల మధ్య గొడవ
యూరో కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు వెంబ్లే స్టేడియం బయట అభిమానులు పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఫలితంగా మైదానానికి వెళ్లే ప్రాంతమంతా రణరంగంలా మారింది. కానీ, ఈ గొడవ వెనుక కారణం మాత్రం తెలియరాలేదు.
యూరో కప్, ఇంగ్లాండ్ అభిమానల మధ్య దాడులు
ఈ ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై గెలిచి ఇటలీ విజేతగా నిలిచింది. 55 ఏళ్ల క్రితం ఈ మెగా ట్రోఫీని గెలిచిన ఇంగ్లీష్ జట్టుకు మరోసారి భంగపాటు తప్పలేదు. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ గేమ్‌లో 3-2 తేడాతో గెలిచిన ఇటలీ కప్‌ను కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి:Euro cup final: ఉత్కంఠ పోరు.. ఇటలీజోరు