తెలంగాణ

telangana

ETV Bharat / sports

బార్సిలోనాతో ముగిసిన మెస్సీ బంధం

దాదాపు రెండు దశాబ్దాల నుంచి బార్సిలోనా తరఫున అద్భుత ప్రదర్శన చేస్తూ, అదరగొట్టిన స్టార్ ఫుట్​బాలర్ మెస్సీ.. క్లబ్​తో బంధానికి ముగింపు పలికాడు. అయితే కొత్తగా ఏ క్లబ్​లో చేరేది మెస్సీ ఇంకా వెల్లడించలేదు.

Barcelona says Messi won't stay with the club
మెస్సీ

By

Published : Aug 6, 2021, 8:40 AM IST

లియోనల్ మెస్సీ-'ఎఫ్​సీ బార్సిలోనా' 21 ఏళ్ల బంధానికి తెరపడింది. అతడితో తమ కాంట్రాక్టు ముగిసిందని పుట్​బాల్​ క్లబ్​ అధికారికంగా ప్రకటించింది. స్పానిష్ లీగ్​లోని​ ఆర్థిక నిబంధనల వల్ల మెస్సీతో కాంట్రాక్టు కొనసాగించలేకపోతున్నామని వెల్లడించింది.

మెస్సీ

బార్సిలోనా క్లబ్​ తరఫున వరుసగా 17 సీజన్లలో ఆడిన మెస్సీ.. ఈ క్రమంలో ఎన్నో దేశీయ, అంతర్జాతీయ టైటిల్స్​ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

గతేడాది కరోనా వల్ల అన్నింటిలానే బార్సిలోనా క్లబ్​ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే ప్లేయర్ల జీతాల్లో కోత విధించింది. కొందరు ఆటగాళ్లనూ వదులుకుంది. మెస్సీతోనూ కాంట్రాక్టు విషయమై చర్చలు జరిపినప్పటికీ, అవి విఫలమయ్యాయి! దీంతో 21 ఏళ్ల బంధానికి తెరపడింది. అయితే మెస్సీ ఏ కబ్ల్​లో చేరేది ఇంతవరకు ప్రకటించలేదు.

మెస్సీ

బార్సిలోనా క్లబ్​లోకి 13 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చిన మెస్సీ మొత్తంగా 35 టైటిల్స్​ దక్కించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇతడు జట్టులో కొనసాగిన సమయంలో ఛాంపియన్స్ లీగ్ 4, స్పానిష్ లీగ్ 10, కోపా కప్ 7, స్పానిష్ సూపర్​ కప్ 8సార్లు గెలిచింది.

ఈ క్లబ్​లో ఉన్నప్పుడు మెస్సీ ఆరుసార్లు గోల్డెన్ బాల్ అందుకోవడం సహా ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్​గానూ నిలిచాడు. 778 మ్యాచ్​ల్లో మొత్తంగా 672 గోల్స్ చేశాడు. స్పానిష్ లీగ్​ 520 మ్యాచ్​ల్లో క్లబ్​ తరఫున అత్యధికంగా 474 గోల్స్ చేశాడు. ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​గా బార్సిలోనా నుంచి ఎక్కువసార్లు నిలిచింది ఇతడే కావడం విశేషం.

మెస్సీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details