ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న క్రీడాకారుల్లో పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ముందుంటాడు. ఇతడితో పాటు టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ.. వారి ఆటతో అదరగొడుతూ సోషల్ మీడియాలోనూ ఫాలోవర్లను సంపాదిస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో వీరికి కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కొన్ని ప్రమోషన్లు చేస్తుంటారు. దీని ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇన్స్టా పోస్టు ద్వారా ఎక్కువగా ఆర్జించిన సెలబ్రిటీల్లో రొనాల్డో అగ్రస్థానం దక్కించుకున్నాడు.
ఓ నివేదిక ప్రకారం 2021 ఏడాదిలో ఇన్స్టాగ్రామ్లో ఒక్కో పోస్టుకు రొనాల్డో రూ. 11.9 కోట్లు ఆర్జిస్తున్నాడు. గతేడాది WWE స్టార్, హాలీవుడ్ హీరో డ్వేన్ జాన్సన్ (The Rock) రూ.11 కోట్లతో మొదటి స్థానంలో ఉండేవాడు. తాజాగా ఇతడు రెండుకు పడిపోయాడు. వీరి తర్వాత స్థానాల్లోపాప్ సింగర్ అరియానా గ్రాండే(Ariana Grande) నిలిచింది.