తెలంగాణ

telangana

ETV Bharat / sports

అతడు కొట్టిన గోల్​ శతాబ్దానికే అత్యద్భుతం - డీగో మారడోనానే కొట్టిన గోల్​ అత్యద్భుతం

ఫుట్‌బాల్‌ అంటే ఠక్కున గుర్తొచ్చేది అర్జెంటీనా వీరుడు డీగో మారడోనానే. అతడి ప్రతి గోలూ ఓ అణిముత్యమే. కానీ 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై అతడు కొట్టిన గోల్‌ మాత్రం ఓ అద్భుతం. దాన్ని శతాబ్దానికే అత్యుత్తమ గోల్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే ?

Digo Mardonane Creates a historic Goal in 1986 world cup match against England
మాయడోనా!

By

Published : Apr 28, 2020, 7:17 AM IST

1982లో అర్జెంటీనా, బ్రిటన్‌ మధ్య అనధికార ఫాక్‌ల్యాండ్స్‌ యుద్ధం జరిగింది. ఆ పోరులో 258 మంది బ్రిటిష్‌ పౌరులు, 655 మంది అర్జెంటీనా దేశస్థులు మరణించారు. అప్పటి నుంచి అర్జెంటీనా, బ్రిటన్‌ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగేళ్ల తర్వాత (1986) మెక్సికోలో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో అర్జెంటీనా, బ్రిటన్‌లో భాగమైన ఇంగ్లాండ్‌ తలపడడంతో ఉత్కంఠ రేగింది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. తొలి అర్ధభాగంలో గోల్స్‌ నమోదు కాలేదు. కానీ విరామం తర్వాత అర్జెంటీనా అనూహ్యంగా పుంజుకుంది. దానికి కారణం మారడోనా. ద్వితీయార్థంలో అతను రెండు గోల్స్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

అతను చేసిన రెండో గోల్‌ అద్భుతమనే చెప్పాలి. 20వ శతాబ్దపు అత్యుత్తమ గోల్‌గా అది చరిత్రలో నిలిచిపోయింది. మ్యాచ్‌లో 55వ నిమిషంలో సహచర ఆటగాడు ఎన్రిక్‌ నుంచి బంతి అందుకున్న మారడోనా ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించుకుంటూ 55 మీటర్ల దూరం నుంచి పరుగెత్తుతూ పది సెకన్లలో బంతిని గోల్‌పోస్టులోకి పంపాడు. అంతే కదా దాంట్లో ప్రత్యేకత ఏముందీ అనిపించవచ్చు. కానీ ఆ గోల్‌ చేసిన విధానం ప్రత్యేకం.

నలుగురు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించుకుంటూ.. గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ అతడు గోల్‌ కొట్టిన తీరు అసాధారణం. బంతిని అందుకున్న మారడోనా తన ముందు నుంచి బంతిని వెనకాలకు నెట్టి ఓ ఆటగాడిని తప్పించి వెంటనే వెనక్కి తిరిగి డ్రిబ్లింగ్‌ చేయడం మొదలెట్టాడు. తర్వాత రెండు వైపులా నుంచి ఇద్దరు ఆటగాళ్లు అడ్డుకోవడానికి వచ్చారు. వాళ్ల మధ్యలో నుంచి బంతిని ముందుకు పోనిచ్చాడు. ఎదురుగా మరో ఆటగాడు దూసుకొస్తున్నాడు. అతన్ని తప్పుదారి పట్టించడానికి ఎడమ వైపు బంతిని తంతున్నట్లు భ్రమ కలిగించి కుడివైపు తన్ని ముందుకు సాగాడు. ఈ సారి గోల్‌కీపర్‌ ఎదురొచ్చాడు. బంతిని గోల్‌పోస్టువైపు కుడికాలితో తంతున్నట్లు మారడోనా మాయ చేశాడు. దాంతో గోల్‌కీపర్‌ తన ఎడమవైపు పడ్డాడు. కానీ మారడోనా ఎడమకాలితో బంతిని పక్కకు నెట్టాడు. ఆ వెనకే మరో ఆటగాడు అడ్డుకోవడానికి వచ్చి కాళ్లు అడ్డం పెట్టాడు. కానీ ఇంతలోనే మారడోనా బంతిని గోల్‌పోస్టులోకి పంపించేశాడు. స్టేడియం హోరెత్తిపోయింది. ఆ గోల్‌తో 2-0 ఆధిక్యం సాధించిన అర్జెంటీనా చివరకు 2-1తో మ్యాచ్‌ సొంతం చేసుకుంది. తర్వాత ఫైనల్లో జర్మనీపై గెలిచి ట్రోఫీ ముద్దాడింది.

ఇదీ చూడండి :లాక్​డౌన్​తో శ్రీలంకలో చిక్కుకున్న 12 మంది క్రికెటర్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details