డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్(Portugal)కు ఊహించని షాక్. యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) నేతృత్వంలోని పోర్చుగల్ ప్రీక్వార్టర్స్‌లో తడబడింది. నాకౌట్ మ్యాచ్‌లో ఆ జట్టు బెల్జియం(Belgium) చేతిలో ఓటమి పాలైంది. 1-0 తేడాతో బెల్జియం ఘన విజయం సాధించింది.
Euro Cup: రొనాల్డోసేనకు ఊహించని షాక్ - పోర్చుగల్ బెల్జియం
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్(Portugal)కు ఊహించని షాక్ ఎదురైంది. ప్రీక్వార్టర్‌లో రొనాల్డో(Cristiano Ronaldo) నేతృత్వంలోని ఈ జట్టు బెల్జియం(Belgium) చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది.
ఆట ప్రారంభం నుంచి ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. త్రొగన్ హజార్డ్(42 నిమిషం) గోల్ కొట్టడం వల్ల బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ ఆధిక్యాన్ని ఆట చివరదాకా తీసుకెళ్లడంలో బెల్జియం సఫలమైంది. ఆటలో ఆధిపత్యమంతా పోర్చుగల్‌దే అయినప్పటికీ అందివచ్చిన అవకాశాలను ఆ జట్టు ఆటగాళ్లు జారవిడిచారు. పోర్చుగల్‌కు నాలుగు సార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా.. విఫలమయ్యారు. దీంతో రెండోసారి కప్ కొట్టేయాలని భావించిన పోర్చుగల్ ఓటమితో ఇంటిముఖం పట్టింది. ఇక బెల్జియం క్వార్టర్ ఫైనల్‌లో ఇటలీతో తలపడనుంది.