తెలంగాణ

telangana

ETV Bharat / sports

అమ్మ బాబోయ్.. రొనాల్డో అంత ఎత్తెలా ఎగిరాడు? - portugal footballar ronaldo

స్టార్ ఫుట్​బాలర్ రొనాల్డో.. 8.39 అడుగుల ఎత్తు ఎగిరి ఓ హెడర్​ గోల్​ కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

అమ్మ బాబోయ్.. రొనాల్డో అంత ఎత్తెలా ఎగిరాడు?
ఫుట్​బాలర్ రొనాల్డో

By

Published : Dec 20, 2019, 9:51 AM IST

క్రిస్టియానో రొనాల్డో.. ఈ పోర్చుగీస్ ఫుట్​బాలర్​కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. వచ్చే ఫిబ్రవరిలో 35వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. అయినప్పటికీ మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తూ, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇలాంటిదే ఓ సంఘటన బుధవారం.. సంప్రోడియా-జ్యూవెంటస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్​లో సగం సమయం పూర్తవుతుండగా ఇరుజట్లు 1-1 స్కోరుతో ఉన్నాయి. అప్పుడు రొనాల్డో.. ఓ అద్భుతమైన హెడర్​ గోల్​ను కొట్టాడు. ఇందుకోసం దాదాపు 8.39 అడుగుల ఎత్తు ఎగిరాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ పోరులో రొనాల్డో జట్టు 2-1 తేడాతో గెలిచింది. అతడు అంత ఎత్తు ఎలా ఎగిరాడంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఇది చదవండి: భాగ్యనగరంలో రూ.6 కోట్లతో ఫుట్​బాల్ మైదానం

ABOUT THE AUTHOR

...view details