తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోనాల్డో ఇంటికి రూ.75 కోట్ల విలువైన అతిథి! - ronaldo new car news

ప్రపంచ స్టార్​ ఫుట్​బాల్​ ప్లేయర్లలో ఒకరు క్రిస్టియనో రోనాల్డో. ఈ క్రీడాకారుడు ఇటీవలే ఓ కారుపై మనసు పారేసుకున్నాడు. దాన్ని సొంతం చేసుకునేందుకు ఏకంగా 75 కోట్లు ఖర్చుచేస్తున్నాడట. మరి ఆ విశేషాలు ఓసారి తెలుసుకుందామా..

Cristiano Ronaldo owns bugatti centodieci car worth of 75 crores
రొనాల్డో ఇంటికి రూ.75 కోట్ల విలువైన అతిథి!

By

Published : Aug 4, 2020, 6:01 AM IST

పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రోనాల్డోను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరని చెప్పవచ్చు. కార్లను అమితంగా ప్రేమించే ఈ 35 సంవత్సరాల దిగ్గజ ఆటగాడు.. ప్రపంచంలోనే అతి ఖరీదైన కారును సొంతం చేసుకుని మరోసారి వార్తల్లోకెక్కాడు. ఫుట్‌బాల్‌ క్రీడలో పతకాలనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యుత్తమ వాహనాలను స్వంతం చేసుకోవటం ఇతనికి అలవాటు. దీనిలో భాగంగా అతి ఖరీదైన 'బుగాటీ లా వొయిట్యూర్‌' కారును కొనుగోలు చేశాడు.

విలాసవంతమైన కార్లకు ప్రసిద్ధి చెందిన బుగాటీ, ఇలాంటి కేవలం పది కార్లను మాత్రమే తయారు చేసిందట. కాగా, ఈ కారు విలువ ఇంచుమించు రూ.75 కోట్లు అని తెలిసింది. ఇది అత్యధికంగా గంటకు 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదట. అయితే ఈ కారు క్రిస్టియానో రోనాల్డో చేతికందేది మాత్రం 2021లోనే!

క్రిస్టియానో రోనాల్డో వద్ద ఇప్పటికే ఫెరారీ 599 జీటీఓ, లంబోర్గినీ అవెంటాడోర్‌ వంటి పలు అత్యాధునిక, ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇతని గ్యారేజీలో ఉన్న కార్ల మొత్తం విలువ రూ.264 కోట్లకు పైమాటే అని సమాచారం. కార్లే కాకుండా, ఐదు క్యాబిన్లు, ఆరు బాత్‌రూంలు గల విలాసవంతమైన తెరపడవ (యాట్‌)ను కూడా రోనాల్డో గత సంవత్సరం సొంతం చేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details