తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రేక్షకులు లేని స్టేడియాన్ని రొనాల్డో ఏమని పోల్చాడంటే.?

పోర్చుగల్​ ఫుట్​బాల్​ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డో.. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు. అభిమానులు లేని మైదానాలు పుష్పాలు లేని ఉద్యానవనాలని పోల్చాడు.

Cristiano Ronaldo
క్రిస్టియానో రొనాల్డో

By

Published : Sep 9, 2020, 9:43 PM IST

అంతర్జాతీయ ఫుట్​బాల్​లో 100 గోల్స్​ సాధించి ఇటీవలే రికార్డు సృష్టించాడు పోర్చుగల్​ స్టార్​ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డో. యూఈఎఫ్​ఏ నేషన్స్ లీగ్​లో భాగంగా.. స్వీడన్​తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్​లో రొనాల్డో ఈ మైలురాయిని అందుకున్నాడు. అయితే మ్యాచ్​లో స్టేడియం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులను అనుమతించలేదు. దీనిపై స్పందించిన రొనాల్డో.. "స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడం విదూషకుడు లేని సర్కస్" అని అన్నాడు.

క్రిస్టియానో రొనాల్డో ఘనతలు

"ఇది నిజంగా చాలా భిన్నమైన అనుభవం. సరిగ్గా చెప్పాలంటే విదూషకులు లేని సర్కస్​లా.. పుష్పాలు లేని ఉద్యానవనంలా అనిపించింది. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడం ఏ ఆటగాడికీ ఇష్టం ఉండదు. అయితే, ఈ వాతావరణానికి నేను అలవాటు పడ్డాను. ఇందుకోసం నేను ముందుగానే ప్రీ మ్యాచ్​ ప్రాక్టీసు చేశా."

క్రిస్టియానో రొనాల్డో, ఫుట్​బాల్​ ఆటగాడు

ఈ విధంగా మ్యాచ్​లు జరగడం విచారంగా ఉందని అన్నాడు రొనాల్డో. అయినప్పటికీ ఆరోగ్యం తొలి ప్రాధాన్యం కనుక.. పరిస్థితులను గౌరవించాలని పేర్కొన్నాడు. అభిమానులు మళ్లీ తిరిగి స్టేడియాల్లో కనిపించేందుకు ఎంతో సమయం పట్టదని ఆశిస్తున్నట్లు రొనాల్డో తెలిపాడు.

క్రిస్టియానో రొనాల్డో

ABOUT THE AUTHOR

...view details