తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉత్తమ మెన్స్​ ప్లేయర్​గా క్రిస్టియానో రొనాల్డో - Globe Soccer Award The Year

జువెంటెస్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో ఉత్తమ మెన్స్ ప్లేయర్ ఆప్ ద ఇయర్ పురస్కారం దక్కించుకున్నాడు. ఉత్తమ ఉమెన్స్​ ప్లేయర్​గా ఇంగ్లాండ్​కు చెందిన లూసీ బ్రాంజ్​ ఎంపికైంది.

Cristiano Ronaldo named 'Best Men's Player of the Year'
రొనాల్డో

By

Published : Dec 30, 2019, 11:51 PM IST

పోర్చుగీస్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉత్తమ మెన్స్ ప్లేయర్ ఆఫ్​ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. దుబాయ్​లో జరిగిన గ్లోబల్ సాకర్ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని తీసుకున్నాడు. జువెంటెస్ జట్టు తరఫున రొనాల్డో వరుసగా నాలుగో ఏడాది ఈ అవార్డు తీసుకోవడం విశేషం.

మరోసారి గ్లోబల్ సాకర్ అవార్డు తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఎంతో భావోద్వేగంగా ఉంది. ఈ పురస్కారాన్ని నా కుటుంబంతో కలిసి పంచుకుంటా. - రొనాల్డో ట్వీట్​.

ఉత్తమ ఉమెన్స్​ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇంగ్లాండ్​కు చెందిన లూసీ బ్రాంజ్​కు దక్కింది. లివర్​పూల్ జట్టు మేనేజర్ జార్జెన్ క్లాప్​కు ఉత్తమ మేనేజర్ అవార్డు వచ్చింది.

ఇదీ చదవండి: క్రికెట్​ ప్రపంచంలో 'రారాజు'గా కోహ్లీ.. 'చక్రవర్తి'గా గంగూలీ

ABOUT THE AUTHOR

...view details