స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్లు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మైదానంలో నువ్వా నేనా అనే రీతిలో పోటీపడతారు. ఒకరు బార్సిలోనా జట్టుకు, మరొకరు జువెంటస్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇద్దరూ ఆటకు కొంతకాలం విరామం ప్రకటింంచారు. ప్రస్తుతం ఆయా దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో.. ఇద్దరూ వార్మప్, ట్రైనింగ్ సెషన్లలో పాల్గొన్నారు.
మెస్సీxరొనాల్డో: వీరిద్దరూ ఒకర్ని మించినోళ్లు మరొకరు - Ronaldo, Messi football skills
ఫుట్‌బాల్ మైదానంలో వాళ్లిద్దరూ తలపడితే పోరాటమే. అలాంటి స్టార్ ప్లేయర్లు కరోనా వల్ల ఆటకు కాస్త విరామం ఇచ్చారు. తాజాగా ఆయా దేశాల్లో లాక్డౌన్ ఆంక్షల సడలింపుల వల్ల ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు మెస్సీ, రొనాల్డో. వారిద్దరూ తమ ప్రతిభ చూపిస్తూ వేసిన గోల్స్.. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
రొనాల్డొ, మెస్సీ
ఇద్దరూ ప్రాక్టీస్‌లో తమదైన ప్రతిభ ప్రదర్శిస్తూ గోల్స్ వేశారు. ఇందులో మెస్సీ తలతో బంతిని బాస్కెట్లో వేయగా.. నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ రొనాల్డో.. ఏకంగా కాలితో తన్ని బంతిని బాస్కెట్లో వేశాడు. ఆ వీడియోలను ఆయా క్లబ్‌లు ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత తమ ప్రియమైన ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: స్టేడియంలో శృంగార బొమ్మలు.. నిర్వాహకులకు జరిమానా!