పోర్చుగల్‌కు చెందిన స్టార్ సాకర్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్లో 760వ గోల్ సాధించి..ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
గురువారం ముగిసిన ఇటలీ సూపర్ కప్‌లో నెపోలి జట్టుపై 2-0తేడాతో విజయం సాధించి తొమ్మిదో టైటిల్‌ను సొంతం చేసుకుంది జువెంటస్. విజయం సాధించిన ఈ జట్టుకు సారథ్యం వహించిన రొనాల్డో.. ఈ పోరులో రెండు గోల్స్ కొట్టాడు. ఈ రెండో గోల్‌తోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు.