తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్​: 'గోమాత' గల్లీ ఫుట్​బాల్​ చూశారా..? - cow playing

గోవాలోని ఓ ప్రాంతంలో ఆవు ఫుట్‌బాల్‌ ఆడి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారిన ఈ వీడియోను... ప్రముఖ క్రికెట్​ వ్యాఖ్యాత హర్షాబోగ్లే ట్విట్టర్​లో సోమవారం పోస్ట్​ చేశారు.

వైరల్​: గోమాత గల్లీ ఫుట్​బాల్​ వీడియో

By

Published : Jul 3, 2019, 7:33 AM IST

వైరల్​: గోమాత గల్లీ ఫుట్​బాల్​ వీడియో

గోవాలో ఓ ఆవు ఫుట్​బాల్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ వ్యాఖ్యాత హర్షాబోగ్లే సోమవారం ఆవు ఫుట్‌బాల్‌ ఆడే వీడియోను ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది అత్యధిక లైక్‌లు, రీట్వీట్‌లతో దూసుకుపోతోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగింది..? అనే విషయంలో బోగ్లే స్పష్టత ఇవ్వలేదు. కానీ.. మైదానంలో ఉన్న ఆటగాళ్లు మాట్లాడిన భాష కొంకణి కావడం వల్ల గోవా అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

స్థానిక యువకులు ఫుట్​బాల్ ఆడుతుండగా బంతి ఆవు సమీపంలో పడింది. అంతే అది కూడా ఆటకు రెడీ అన్నట్టు బంతిని తన దగ్గరే పెట్టుకుంది. ఎవరైనా బంతి కోసం దగ్గరికి వెళ్తే కస్సుమంది. ఓ యువకుడు కాస్త ధైర్యం చేసి బంతిని లాక్కొని మరో వ్యక్తి వైపు విసిరాడు. అప్పటికీ పట్టువిడువని ఆ గోమాత బంతి ఎటువైపు విసిరితే అటువైపు వెళ్తూ ఛేజింగ్ చేసింది. ఆవు ఫుట్​బాల్​ నైపుణ్యం చూసిన నెటిజన్లు... రొనాల్డో, మెస్సీ కూడా దీని ముందు మోకరిల్లాల్సిందేనని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు దానికో జెర్సీ ఇవ్వాలంటూ ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details